కాసేపటి క్రితమే మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ముందుగా పవన్ గురించి మరియు ఆయన ఇటీవల చేసిన వారాహి యాత్ర గురించి మాట్లాడి, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ మొత్తం యువగలం పేరుతో చేస్తున్న పాదయాత్ర గురించి మాట్లాడింది. రోజా లోకేష్ ను ఉద్దేశించి మాట్లాడుతూ.. లోకేసూ ముందు ఎమ్మెల్యేగా గెలిచి చూపించు… ఆ తర్వాత అధికారంలోకి రావాలి అన్న పగటి కలలు కనవచ్చు అంటూ వ్యాఖ్యలు చేసింది. గతంలో జరిగిన ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. ఈ సారైనా సరైన నియోజకవర్గాన్ని ఎంచుకుని పోటీ చెయ్యి లోకేష్ అప్పుడైనా గెలుస్తావో లేదో అంటూ సెటైర్ వేసింది రోజా.
కాగా నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో భాగంగా నోరు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు వైసీపీపైన మరియు జగన్ పైన విమర్శలు చేస్తున్నాడు. మరి రోజా చేసిన ఈ విమర్శలపై టీడీపీ నుండి ఎవరైనా స్పందిస్తారా చూడాలి.