బీజేపీ సంస్థాగత మార్పుల్లో భాగంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి జాతీయ కార్యవర్గంలో చోటు దక్కింది. ఆయనను జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. కాగా.. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిని, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ను నియమించిన విషయం తెలిసిందే.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆదేశాల మేరకు బుధవారం పార్టీ జాతీయ కార్యదర్శ అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తోందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరించున్నారు. అయితే, గత కొంతకాలంగా కోమటిరెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికీ చేరుతారని తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇందుకోసం ఆయన సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చర్చలు కూడా జరుపుతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. మరోవైపు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పొంగులేటి, జూపల్లి కూడా రాజగోపాల్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.