టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టవడంతో.. ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే.. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ కావడంతో..ఏపీ బంద్ కు టీడీపీ కార్యకర్తలు పిలుపునిచ్చాయి. అయితే ఈ బంద్ ను ఏపీ ప్రజలు లైట్ తీసుకున్నారు. ఎవరూ కూడా బంద్ లో పాల్గొనలేదు. టీడీపీ బంద్ ను పట్టించుకోకుండా తమ రోజు వారి కార్యక్రమాలను చేసుకున్నారు.ఏపీ బంద్ ను రాష్ట్ర ప్రజలే కాదు..స్వయంగా చంద్రబాబు ఫ్యామిలీ కూడా పట్టించుకోకపోవడం గమనార్హం. టీడీపీ ఏపీ బంద్ కు పిలుపునిచ్చి.. అన్ని దుకాణాలు..ఇతర సంస్థలు మూసివేయాలని చెబితే..నారా వారి ఫ్యామిలీ మాత్రం..తమ సంస్థ హెరిటేజ్ కార్యాలయాన్ని కూడా మూసివేయలేదు.
యధేచ్ఛగా హెరిటేజ్ దుకాణం నడిచింది.హెరిటేజ్ దుకాణం ఓపెన్గా ఉండటంపై ఏపీ మంత్రి రోజా సెటైర్లు వేశారు. ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు భార్య, లోకేష్ భార్యా కూడా ఏపీ బంద్ ను పాటించలేదని చురకలంటించారు. బంద్ లేదు.. బొంద లేదు.. అని బార్లా తెరుచుకున్న హెరిటేజ్ అంటూ హెరిటేజ్ షాపు వీడియో, ఫోటోను షేర్ చేశారు. హెరిటేజ్ సంస్థలు, చంద్రబాబు కుటుంబానికి వాళ్ళ వ్యాపారం బాగుండాలి.. ఆయన కోసం ఇతరులు మాత్రం బంద్ పాటించాలా..? వీరి నైజం తెలుసు కాబట్టే #AndhraPradesh ప్రజలు బంద్ ని విఫలం చేశారు… అని మంత్రి రోజా విమర్శించారు.