కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ అస్త్రాలు : మంత్రి సబితా

-

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. నిన్నటితో మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్‌ల ప్రక్రియ ముగిసింది. అయితే.. నిన్న కాంగ్రెస్‌ పార్టీ తరుఫున పాల్వాయి స్రవంతి నామినేషన్‌ వేశారు. అయితే.. బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి పాల్వాయి స్రవంతిలతో పాటు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి ఈ ఉప ఎన్నికల బరిలో ఉన్నారు. అయితే.. నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిథులు విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లి మండలంలోని పసునూరులో పార్టీ అభ్యర్థి కూసుకుంట్లకు మద్దతుగా ప్రచారం చేశారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ అస్త్రాలన్నారు మంత్రి సబితా.

బీజేపీకి ఓటేస్తే మీటర్లు పెట్టొచ్చని రాసిచ్చినట్లే: మంత్రి సబిత

బీజేపీ నిరంకుశ విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నామని చెప్పారు. ఆ పార్టీకి ఓట్లేస్తే మీటర్లు పెట్టాలని రాసిచ్చినట్లే అవుతుందన్నారు మంత్రి సబితా. అందువల్ల అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలని, ఎట్టిపరిస్థితిలో బీజేపీని అడుగు పెట్టనివ్వొద్దని సూచించారు మంత్రి సబితా. ముఖ్యంగా మహిళలు.. పెంచిన గ్యాస్‌ ధరలను గుర్తుపెట్టుకొని బీజేపీ వాళ్లకు బుద్ధిచెప్పాలన్నారు మంత్రి సబితా.

Read more RELATED
Recommended to you

Latest news