తెలంగాణ ఇంటర్ బోర్డు 30 శాతం సిలబస్ కుదిస్తుందని వస్తున్న వార్తలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇంటర్ సిలబస్‌ను తగ్గించే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇంటర్ విద్యార్ధులకు 30 శాతం ఆన్లైన్ క్లాసులు, 70 శాతం ఆఫ్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిపారు. పాఠశాలల పునఃప్రారంభంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న ఆమె.. ఇంజనీరింగ్ తరగతులను ఆగష్టు 17 నుంచి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు.
కరోనా వైరస్ మహమ్మారి దాదాపుగా అన్ని రంగాలను కుదిపేసింది. ప్రధానంగా విద్యారంగంపై వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. దీంతో ఇప్పటికే పదో తరగతి పరీక్షలు చేస్తూ.. విద్యార్థులను పై తరగతులకి ప్రమోట్ చేశారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు అప్పటికే పరీక్షలు నిర్వహించడంతో ఊపిరి పీల్చుకున్నారు. యూజీ, పీజీ తదితర పరీక్షలన్నీ నిలిచిపోయాయి.