10 సార్లు సీఎం అయినా.. కేసీఆర్‌ చేయలేవు : శివరాజ్ సింగ్ పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్‌

-

10 సార్లు సీఎం అయినా.. కేసీఆర్‌ లా అభివృద్ధి చేయలేవని… మధ్య ప్రదేవ్‌ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్‌ అయ్యారు. నాలుగు సార్లు సీఎం అయిన చౌహన్…ఇంకో సీఎం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు సార్లు సీఎం అయి చౌహన్ ఆ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారు ? రాష్ట్రాల అభివృద్ధి గురించి చౌహన్ మాట్లాడితే బాగుండేదన్నారు.

శివరాజ్ చౌహన్ కు ఏమైనా మతి భ్రమించిందా ? అని నిలదీశారు. 10 సార్లు సీఎం అయిన తెలంగాణ రాష్ట్రంలా మధ్య ప్రదేశ్ ను శివరాజ్ సింగ్ చౌహన్ అభివృద్ధి చేయలేరని చురకలు అంటించారు. మాకు తిక్కలేస్తే మేము కూడా మధ్యప్రదేశ్ వచ్చి మాట్లాడతామని వార్నింగ్‌ ఇచ్చారు. ఢిల్లీ నుంచి బిజెపి నేతలు టూరిస్ట్ ల లాగా వస్తున్నారని… సీఎం కేసీఆర్ దమ్ము గురించి పీఎం మోడీని అడిగి తెలుసుకో అంటూ శివరాజ్ సింగ్ చౌహన్ కు సవాల్‌ విసిరారు. మేము మీకు ఎందుకు భయపడతాం ? మేము మీకంటే ఎక్కువ చూపిస్తాం …ఆషామాషీ కాదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news