BREAKING : బాలయ్యను కలిసిన మంత్రి విడదల రజని..ఫోటో వైరల్ ?

-

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్‌ వీడియో ఎపిసోడ్‌ మరువక ముందే.. మరో ఫోటో ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఫొటోను తీసుకుని… టీడీపీ సోషల్‌ మీడియా శ్రేణులు సాయిరెడ్డి తలకు బాలకృష్ణ తలను అతికించి దుష్ప్రచారానికి దిగారు.

మంత్రి రజని పార్టీ మారుతున్నారంటూ… జగన్‌కు షాక్‌ ఇస్తున్నారని వీడియోలు సృష్టించి వైరల్‌ చేశారు. అయితే.. ఈ ఫోటోలు చూసిన ఏపీ ప్రజలు నిజంగానే ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని పార్టీ మారుతున్నారని అనుకుంటున్నారు.

అయితే.. ఈ విషయం వైసీపీ కంట పడటంతో.. బాలయ్యను ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని కలిసినట్లు టీడీపీ పార్టీ ఫేక్‌ ఫోటోను సృష్టించిందని ఆధారాలతో బయట పెట్టారు. దీంతో ఈ వివాదానికి తెరపడింది. ఇదిలా ఉండగా…రానున్న రోజుల్లో బాబుకు బీసీలు మరింత గట్టిగా బుద్ధి చెబుతారని పలువురు బీసీ నేతలు బాబు తీరుపై ఇప్పటికే మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news