తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు ఎలాంటి అధికారాలు ఉండవని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంధర్ అన్నారు. అంతా కేసీఆర్ అధికారిమే ఉంటుందని ఆరోపించారు. ఇక ఎమ్మెల్యే లకు అయితే ఇంకా ఎలాంటి అధికారలు ఉండవని విమర్శించారు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని అన్నారు. మంత్రులు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. సీఎం కేసీఆర్ ను అడగాల్సిందే నని అన్నారు. కాగ నేడు హైదరాబాద్ లోని ధర్నా చౌక్ లో వీఆర్ఏలు మహా ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాకు మద్దతు పలుకిన ఎమ్మెల్యే ఈటల రాజేంధర్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత రాష్ట్ర ప్రజలను కలిసే ప్రయత్నం కేసీఆర్ ఇప్పటి వరకు చేయాలేదని విమర్శించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖ కు అనుసంధానంగా ఉన్న వీఆర్ఏల పై సీఎం వైకరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఈటల రాజేందర్ ప్రకటించారు.