నేడు ఆకాశంలో అద్భుతం.. ఒకే కక్ష్యలోకి భూమి, సూర్యుడు, కుజుడు

-

శాస్త్ర విజ్ఙానం ఎంత వేగంగా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నా.. ఈ సృష్టిలో చేదించ‌ని ర‌హ‌స్య‌లు, వింత‌లు ఎన్నో ఉన్నాయి. ఇప్ప‌టికీ అవి మ‌న క‌ళ్ల ముందు జ‌రుగుతూనే ఉన్నాయి. శాస్త్ర‌వేత్త‌లు సైతం వాటిపై ప‌రిశోధ‌న‌లు కోన‌సాగిస్తూనే ఉన్నారు. అయితే.. నేడు భూమి, సూర్యుడు, కుజ గ్రహాలు ఒకే కక్ష్య(సరళరేఖ)లోకి రాబోతున్నట్లు ప్లానిటరీ సొసైటీ ఆఫ్‌ ఇండియా డైరెక్టర్‌ రఘునందన్‌రావు తెలిపారు. ఉదయం 11:12 గంటలకు ఈ ఖగోళ విశేషం ఆవిష్కృతం అవుతుందన్నారు. ‘భూమికి దగ్గరగా రావడంతో కుజ గ్రహం పెద్దదిగా, కాంతిమంతంగా కనిపిస్తుంది. సూర్యుడు అస్తమించిన తరువాత కూడా తూర్పు వైపు చిరకాంతితో దర్శనమిస్తుంది.

నేడు ఆకాశంలో అద్భుతం.. ఒకే కక్ష్యలోకి భూమి, సూర్యుడు, కుజుడు

ప్రతి 26 నెలలకోసారి ఇది పునరావృతం అవుతుంది. ఇప్పుడు కనిపించేంత కాంతిమంతంగా గ్రహాన్ని చూడాలంటే మరో తొమ్మిదేళ్లు ఆగాల్సి ఉంటుంది. ఈ ఖగోళ విశేషం వచ్చే ఏడాది జులై వరకు కనువిందు చేస్తుంది. రోజులు గడిచేకొద్దీ భూమికి, గ్రహానికి మధ్య దూరం పెరుగుతూ కుజ గ్రహ కాంతి తగ్గుతూ వస్తుంది. దాన్ని వీక్షించేందుకు హైదరాబాద్‌ బోయినపల్లిలోని సెయింట్‌ ఆండ్రివ్స్‌ పాఠశాలలో ఏర్పాట్లు చేస్తున్నాం’ అని రఘునందన్‌రావు వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news