కర్ణాటకలో జెడిఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కళాశాల ప్రిన్సిపాల్ పై చేయిచేసుకున్నాడు. సాధారణంగా విద్యార్థులు తప్పుచేస్తే గురువులు దండించడం సహజం. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ఉపాధ్యాయులు చెంప దెబ్బ కొడుతుంటారు. కానీ తాను అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేదని ఈ ఎమ్మెల్యే కళాశాల ప్రిన్సిపాల్ నే కొట్టి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యా లో చోటుచేసుకుంది. మాండ్య నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్ మాండ్య లోని నల్వాడి కృష్ణ రాజా వడయార్ ఐటిఐ కళాశాల ను ఈ నెల 20న సందర్శించారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన అక్కడ కంప్యూటర్ ల్యాబ్ కు సంబంధించి జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఈ క్రమంలో తన ప్రశ్నలకు ప్రిన్సిపల్ నాగనాథ్ సరైన సమాధానాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే కోపం తెచ్చుకున్నారు.
కళాశాల సిబ్బంది, ప్రజల ముందే సదరు ప్రిన్సిపాల్ ను చెంపదెబ్బ కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో ఎమ్మెల్యే తీరుపై కర్ణాటకలోని ఉద్యోగ సంఘాలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
#Karnataka: A JD(S) MLA Srinivas slapped a college principal who was not able to provide clear answer about the ongoing development work for a computer lab.
The incident, which happened on Monday, has created a huge outrage among the public. pic.twitter.com/WFnwK280Sg
— IANS (@ians_india) June 21, 2022