అమెరికా నుంచి వచ్చి క్వారంటైన్ లేకుండా తిరుగుతున్న ఎమ్మెల్యే గారు…!

-

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం మొత్తం ప్రాణ భయంతో వణికిపోతుంది. అన్ని దేశాలు కూడా ఇతర దేశాల నుంచి వచ్చే వారి విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా విదేశాల నుంచి వచ్చిన వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. 14 రోజుల పాటు ఎవరు విదేశాల నుంచి వచ్చినా సరే గృహ నిర్భంధం లో ఉండటం అనేది తప్పని సరి.

కాని అమెరికా నుంచి వచ్చిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు మాత్రం అధికారులు అలాంటి చర్యలు తీసుకోలేదు. గత నెల రోజుల నుంచి అమెరికాలో అన్ని రాష్ట్రాలు తిరిగిన కోనప్ప… నిన్న సతీమణి రమా దేవి తో కలిసి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. 14 రోజులు వారిని క్వారంటైన్ కి పంపకుండా అధికారులు ఇంటికి పంపించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

ఒక పక్క తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్… విదేశాల నుంచి ఎవరు వచ్చినా సరే క్వారంటైన్ చెయ్యాలని స్పష్టంగా చెప్పారు. అయినా ఎమ్మెల్యే గారి విషయంలో అధికారులు లెక్క చేయలేదు. ఈ రోజు ఉదయం ఆయన తెలంగాణ ఎక్స్ ప్రెస్ లో కాగజ్ నగర్ కు వచ్చారు ఆయన. దీనితో రైల్లో ఉన్న అందరికి వ్యాధి సోకే అవకాశాలు ఉన్నాయి. అలాగే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి వెళ్లి కనీసం మాస్క్ ధరించకుండా పాల్గొన్నారు ఆయన.

ఆయనకు అది ఉంటే మాత్రం అందరికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. అమెరికాలో ఈ వ్యాధి తీవ్రత అంతకు అంతకు పెరిగుతుంది. అక్కడ 200 మంది వరకు చనిపోయారు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచే వచ్చారు. అయినా సరే ఆయన విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించారు. ఆయన మధ్యాహ్నం కుమూరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవా స్థానంలో,

జిల్లా ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము కార్యక్రమములో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. ఆయన మాస్క్ ధరించలేదు. అక్కడ ఎంతో మందికి బిపి, షుగర్ పేషంట్లు మరియు వయోవృద్ధులు గా ఉన్నవారికి ఈ వ్యాధి వేగంగా సోకే అవకాశం ఉంది. కాబట్టి సదరు ఎమ్మెల్యే గారిని గృహ నిర్భంధంలో ఉంచాలని పలువురు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news