కే‌సి‌ఆర్ ని చూసి మోడి నేర్చుకోవాలి .. సోది చెప్పడం ఆపవయ్యా మోడి !

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వైరస్ విషయంలో కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడ కూడా వైరస్ ప్రబలకుండా ఐసోలేషన్ రూములు ఏర్పాటు చేసి సామర్థ్యం కలిగిన వైద్యులను అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఇండోనేషియాకు చెందిన కరోనా పాజిటివ్ రోగులు తిరిగిన ప్రతిచోట జల్లెడ వేసి మరి వైద్య బృందాలను నర్సు లను రంగంలోకి దింపి తెలంగాణ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్నారు.Image result for modi kcrఇటువంటి నేపథ్యంలో ఇటీవల ప్రధాని మోడీ ఈ వైరస్ విషయంలో కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. మార్చి 22వ తారీకు నుండి వారం రోజుల పాటు ఎవరు కూడా బయటకు రాకూడదు అని మీకు కావలసిన అత్యవసర వస్తువులు అన్నీ మేమే ఇంటికి పంపిస్తా మంటూ మోడీ ప్రసంగించారు. వ్యక్తిగతంగా ఎవరికి వారు శ్రద్ధ తీసుకుంటే గాని కరోనా వైరస్ అదుపులోకి రాదని సూచించారు. ఇటువంటి నేపథ్యంలో మోడీ చేసిన స్పీచ్ పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.

 

కెసిఆర్ ని చూసి మోడీ చాలా నేర్చుకోవాలని…ఇంట్లో నుండి బయటకు రాకూడదు అని కెమెరా ముందు చెప్పినంత ఈజీ కాదు అని…ఎక్కడికక్కడ కేంద్రం కూడా వైద్య బృందాలను పంపి కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తే గాని ప్రజలు అప్రమత్తంగా ఉండరని అంటున్నారు. మీరు చెప్పింది అంతా సోది మాదిరిగా ఉంది…వైద్య బృందాలను ప్రతి రాష్ట్రంలో కేంద్రం దింపాలి అంటూ నెటిజన్లు సూచిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news