రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏ లీడర్ ఎక్కడ పడుకున్నాడనే పనిలోనే ఉన్నారు – ఎమ్మెల్యే జగ్గారెడ్డి

-

పేదవారు ఆసుపత్రులలో బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని.. ఆరోగ్యశ్రీ పూర్తిగా అమలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుని, సీఎం కేసీఆర్ ని కోరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సరిగ్గా అమలు కావడం లేదని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ మీద సీఎం కేసీఆర్ గారు చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ప్రతి మనిషిని బతికించే ఆలోచన చేయాలన్నారు జగ్గారెడ్డి.

10 లక్షల బిల్లు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ కింద కేవలం 30 వేలే ఇస్తున్నారని ఆరోపించారు. ఇదే కాంగ్రెస్ హయాంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా అమలయ్యేదని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో ఆలోచించి పేద ప్రజల కోసం ఆరోగ్య శ్రీ పథకం తీసుకువచ్చారని.. తర్వాత సీఎం రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయంలో కూడా ఆరోగ్యశ్రీ బాగా అమలు అయిందన్నారు.

గతంలో ఇంటిలిజెన్స్ వాళ్ళు ప్రభుత్వ పరిపాలన పై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లే వారని.. కానీ ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్ ఎప్పుడైనా ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో సీఎం దృష్టికి తీసుకెళ్లిన సందర్భం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అంతా ఏ లీడర్ ఎక్కడ పడుకున్నాడు.. ఏం చేస్తున్నాడని పనిలోనే ఉన్నారని మండిపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పూర్తిగా అమలు అయ్యేలా చూడాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news