కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు?

-

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావుకు ఈసారి టికెట్ నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో మంత్రి హరీశ్ రావు పై నిప్పులు చెరిగారు. హరీశ్ రావు అడ్రస్ గల్లంతే.. అని గద్దె దింపే వరకు నిద్రపోను.. వేంకటేశ్వరస్వామిపై మరీ ఒట్టేసి మరీ శపథం చేశారు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలన్నింటిని మంత్రి హరీశ్ రావు చూసుకుంటున్నారు. దీంతో అతడు సూచించిన వారికే ఉమ్మడి జిల్లాలో టికెట్ దక్కే అవకాశాలున్నాయి. మెదక్ నియోజకవర్గంలో తన తనయుడిని బరిలోకి దించడానికి మైనంపల్లి సిద్ధమయ్యారు.

హరీశ్ రావు ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారట. హరీశ్ రావుపై కోపంతో రగిలిపోతున్న మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేటలో హరీశ్ రావు అడ్రస్ గల్లంతు చేయడం ఖాయమన్నారు. హరీశ్ రావును గద్దె దింపి దుకాణం బంద్ చేయించే వరకు నిద్రపోనని మైనంపల్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ లో టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారట మైనంపల్లి హన్మంత్ రావు. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో కూడా టచ్ లో ఉన్నారట. కాంగ్రెస్ పోటీ చేసి విజయం సాధిస్తారో లేదో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version