చెప్పులతో కొట్టిస్తాం.. MLA పల్లా ఫైర్..!

-

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలవడంతో ఆ పార్టీలోని సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు బిజెపి లో చేరగా మరో ముగ్గురు గులాబీ ఎంపీలు ఒక ఎమ్మెల్యే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేపంపై జనగాం ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలును ఎంపీలని కొందరు బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని అన్నారు. అక్రమాన్ని సక్రమం చేసుకోవడానికి కొంతమంది స్వార్థపరులు పార్టీ మారుతున్నారని మండిపడ్డారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి రాజీనామా చేయకుండా ఎలా పార్టీ మారుతారని అన్నారు పార్టీ మారుతున్న స్వార్ధపరులు అక్రమాలని ప్రతిపక్షంలో ఉండి కూడా చీల్చి చెండాడుతామని అన్నారు అధికార పార్టీలోకి వెళ్లి అలాగే అక్రమాలు చేస్తే ప్రజలతో చెప్పులతో కొట్టిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version