జనగామ జిల్లాలో ఎమ్మెల్యే రాజయ్యకు చేదు అనుభవం

-

జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఓబులాపూర్ లో ఎమ్మెల్యే రాజయ్య కు చేదు అనుభవం ఎదురైంది. జఫర్గడ్ మండలం ఓబులాపూర్ లో ఆసరా పెన్షన్ కార్డులు, బతుకమ్మ చీరలు పంపిణీ చేసారు ఎమ్మెల్యే రాజయ్య. అనంతరం ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా దళిత బందు ఇవ్వరా అని ప్రశ్నించారు దళితులు. ఎమ్మెల్యే ఎదుటే దళితుల మధ్య వాగ్వాదం మొదలైంది.

దీన్ని కవరేజ్ చేస్తున్న మీడియాపై దురుసుగా ప్రవర్తించాడు టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అలుగోజు అనిల్. అతడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news