సాగు చట్టాల రద్దుపై పలు రాజకీయ పార్టీల నేతలు తమకు తోచిన విధంగా స్పందిస్తున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి పార్టీలు మోదీని ఆకాశానికి ఎత్తేస్తుంటే… కాంగ్రెస్, త్రుణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు రైతులకు మద్దతుగా.. బీజేపీ, మోదీని వ్యంగంగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క సాగు చట్టాల రద్దుపై స్పందించారు. ’ మోదీ సారథ్యంలోని 302 మంది ఎంపీల కన్నా రాహుల్ గాంధీ సారథ్యంలోని 53 మంది కాంగ్రెస్ ఎంపీలు పవర్ ఫుల్ అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. థాంక్స్ రాహుల్ గాంధీ అంటూ రాసుకొచ్చారు. రైతులకు, టికాయత్ కి అభినందనలు తెలియజేశారు. థాంక్స్ యూపీ, పంజాబ్ ఎలక్షన్స్, 700 మంది అమాయక రైతుల ప్రాణాలు తీశామని ప్రభుత్వం ఒప్పుకోవాలి. గుర్తుంచుకోండి మనం అంతా ఏకం అయితే మనకన్నా శక్తివంతులెవ్వరూ లేరు‘ ఇలా సీతక్క ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.
53 Congress MPs under Rahul Gandhi is powerfull than 302 MPs of Modi Government..
🔥That’s @RahulGandhi ji for India 🙏#FarmersProtest #FarmersProtest_Martyrs #Farmers #FarmLaws #rahulgandhi @priyankagandhi @manickamtagore @revanth_anumula @kcvenugopalmp #MyleaderRahulGandhi pic.twitter.com/KUwXxDf3e6— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) November 19, 2021