రేవంత్ రెడ్డికి రాఖీ కట్టి మాస్కు, శానిటైజర్ కానుకగా ఇచ్చిన సీతక్క..!

-

రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క మల్కాజ్ గిరి ఎంపీ, సహచర కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. నా సోదరుడు ఎంపీ రేవంత్ రెడ్డికి హ్యాపీ రక్షా బంధన్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ కు ఎంతో ఆప్యాయంగా రాఖీ కట్టిన సీతక్క మాస్కు, శానిటైజర్ బహూకరించారు. రేవంత్ కు మిఠాయి తినిపించి సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఆమెతో పాటు పలువురు మహిళా నేతలు కూడా రేవంత్‌కి రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో రేవంత్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news