రాజధాని గ్రామాల్లో స్పీడు పెంచిన ఎమ్మెల్యే శ్రీదేవి

Join Our Community
follow manalokam on social media

రాష్ట్రంలో వైసీపీ నాయకుల పరిస్థితి ఒకలా ఉంటే.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీరు మరోలా ఉండేది. సొంత నియోజకవర్గంలో పర్యటించడానికి కూడా బయపడే స్థితికి వెళ్లారు. ఓ వైపు వ్యక్తిగత వివాదలు మరో వైపు రాజధాని ఆందోళనలు కొన్ని గ్రామాల్లో ఎమ్మెల్యే కాలు పెట్టడానికి భయపడిన పరిస్థితి..అలాంటి ఎమ్మెల్యే స్థానిక ఎన్నికల తర్వాత రూటు మార్చారు. ఏకంగా టీడీపీ అధినేతకే సవాళ్లు విసురుతున్నారు.

రాజధాని తరలింపు ప్రకటనతో తాడికొండ నియోజకవర్గంలోని రాజధాని గ్రామాల్లో శ్రీదేవి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఏడాదిపాటు ఆయా గ్రామాల్లో పర్యటనకు కూడా రాలేకపోయారు. మరో వైపు వరుస వివాదలు సొంత పార్టీ నేతలతో విభేదాలు ఎమ్మెల్యేని ఉక్కిరిబిక్కిరి చేశాయి. స్థానికంగా వైసీపీ నేతలతో విబేధాలు.. ఫోన్ కాల్స్ ఆమెను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ఇప్పుడు తాడికొండలో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే శ్రీదేవి. స్థానికులతో కలసి ఆటలు ఆడుతు ప్రత్యర్ధులకు సవాళ్లు విసురుతున్నారు.

కొద్ది రోజుల క్రితం నియోజకవర్గంలోని 46 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో 38చోట్ల వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అమరావతి పరిధిలోని గ్రామాల్లో మంచి ఫలితాలు రావడంతో శ్రీదేవి కాస్త తేలిక పడ్డారట. ఇప్పుడు రాజధాని గ్రామాల్లో విస్తృత పర్యటనలు చేస్తూ స్థానికులతో కలిసి ఆటలు ఆడుతూ కొత్త చర్చకు కారణం అవుతున్నారు. రోడ్లపై మేకలు కాస్తూ, కుర్రాళ్లతో వాలీబాల్ ఆడుతున్నారు.

అమరావతి విషయంలో ప్రతిపక్షంపై ఎమ్మెల్యే పెద్దగా మాట్లాడేవారు కారు. పంచాయతీ ఎన్నికల తర్వాత విమర్శల డోస్‌ పెంచారు. టీడీపీ నేతలను, చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ ప్రెస్‌మీట్లు పెడుతున్నారు శ్రీదేవి. ఎంపీ నందిగం సురేష్‌ వర్గంతో పడక.. సొంత పార్టీ నేతల ఆరోపణలు.. పేకాట క్లబ్‌ గొడవ ఇలా వివిధ అంశాలతో ఆమె ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత సైలెంట్‌ అయ్యారు. ఇప్పుడు మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చిన ఎమ్మెల్యే శ్రీదేవి నియోజకవర్గంలో దూకుడు పెంచారు. టీడీపీ అగ్రనేతల పై వరుస కామెంట్స్ తో నియోజకవర్గంలో హీట్ పుట్టిస్తున్నారు.

TOP STORIES

రెండు మాస్కులు ధరిస్తే కరోనా వ్యాప్తి తక్కువగా ఉంటుందా? నిపుణులు ఏం చేబుతున్నారు?

కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఒక్కరోజులో రెండులక్షలకి పైగా కేసులు వస్తున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరిగే...