ఏపీ సీఎం వైఎస్ జగన్ మరోసారి హస్తిన బాట పట్టనున్నారు..నేటి ఉయదం పులివెందులకు వచ్చి అక్కడి నుంచి నేరుగా రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి..రేపు ఉదయం ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు..రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానితో చర్చినున్నారు..ఈ పర్యటనలో మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులను కూడా సీఎం జగన్ కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు కరోనా అంశంపై సీఎం జగన్ కేంద్ర పెద్దలతో చర్చించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది..కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ రంగ సంస్కరణల బిల్లులను వ్యతిరేకిస్తున్న ఎన్డీఏ మిత్రపక్షం శిరోమణి అకాళీదళ్ (ఎస్ఏడీ) ప్రభుత్వం నుంచి వైదొలగిన విషయం తెలిస్సిందే..వ్యవసాయ బిల్లులకు వైసీపీ ఎంపీలో మద్ధతు ఇవ్వడంతో కేంద్రంతో వైసీపీ బంధం మరింత బలపడింది..శిరోమణి అకాళీదళ్ స్థానాన్ని మరో స్థానిక పార్టీతో భర్తీ చేయాలన్న కమలదళం ఆలోచనలకు ఇప్పుడు వైసీపీ ప్రత్యమ్నాయంగా కనిపిస్తుంది..వైసీపీ ఎన్డీఏలో బాగాస్వామ్యం అయ్యే అవకాలు ఉన్నాయని వస్తున్న ఊహాగానాలకు జగన్ ఢిల్లీ పర్యటన మరింత బలం చేకూర్చుతుంది.