ఒకపక్క మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ 22 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలలో ఒకరైన సురేష్ దక్కడ్ కుమార్తె జ్యోతి రాజస్థాన్ లోని తన అత్తగారింట్లో ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. 24 ఏళ్ల జ్యోతికి ఇటీవలే పెళ్లి జరిగింది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనేది స్పష్టత లేకపోయినా కుటుంబ వివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వ్యవహారం పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జ్యోతి భర్త డాక్టర్ జైసింగ్. రాజస్థాన్ వైద్యవిభాగంలో ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని పొహారీ నియోజకవర్గం నుంచి సురేష్ ధక్కడ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమయింది.
22 మంది ఎమ్మెల్యేలు 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కమల్ నాథ్ కూడా శుక్రవారం మధ్యాహ్నం తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. అయితే ఆమె మనస్తాపం చెందే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్న పోలీసులు కుటుంబ సభ్యులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.