నేడు రాజమండ్రి కోర్టుకు ఎమ్మెల్సీ అనంతబాబు

-

ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ఉరఫ్ అనంతబాబు రిమాండ్ నేటితో ముగిసింది. తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ అనంత బాబుకు నేటితో రిమాండ్ పూర్తి అవ్వడంతో నేడు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ముందు ఎమ్మెల్సీ అనంత బాబును పోలీసులు హాజరు పరచనున్నారు. ఇప్పటివరకు అనంత బాబుకు నాలుగు సార్లు రిమాండ్ పొడిగించింది కోర్టు. మే 19న డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరగగా.. 23న ఎమ్మెల్సీ అనంతబాబుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు అనంతబాబు.

అయితే ఇప్పటికే రెండుసార్లు బెయిల్ కోరగా న్యాయస్థానం తిరస్కరించింది. నేడు అనంతబాబును రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టులో హాజరపరచాల్సింది ఉండగా.. సీఎం పర్యటన ఉండడంతో ఎస్కార్ట్ ఏర్పాటు చేయలేమని జైలు అధికారులకు తెలిపారు పోలీసులు. దీంతో కచ్చితంగా ఎస్కార్ట్ ఏర్పాటు చేయాలని పోలీస్ ఏఆర్ విభాగానికి జైలు అధికారులు లేఖ రాశారు. అయితే అనంతబాబుని ఆన్ లైన్ లో హాజరుపరుస్తారా? లేక కోర్టు ముందు హాజరు పరుస్తారా? అనేదానిపై సస్పెన్స్ నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news