తిరుపతి ఎస్వీ జంతు ప్రదర్శన శాలలో ఘనంగా అంతర్జాతీయ పులుల దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరై.. అటవీ శాఖ ఏర్పాటు చేసిన పులుల ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలో 75 పులులు సంచరిస్తున్నాయన్నారు.
రష్యాలో టైగర్ సదస్సు 2010 లో జరిగిందని.. అప్పటి నుండి మనం అంతర్జాతీయ పులుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. భారతదేశం లోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉన్నాయని.. 2018 కంటే ఇప్పుడు 60 శాతం పులుల పెరిగాయి, దాదాపు 64 పులుల ఉన్నాయని పేర్కొన్నారు.
శేషాచలం ను కారిడారుగా చేసుకుని పులుల సంచరిస్తున్నాయి.. పాపికొండలు వైపు కూడా పులుల సంచరిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో పులుల సంపద ఎక్కువగా ఉంది అని చెప్పుకోవడం సంతోషమని.. పులుల సంఖ్య మరింత వృద్ధి చెందేలా అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి పెద్దిరెడ్డి.