రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గం లో కొత్తగా రెండు మండలాలు చిల్ఫుర్ , వేలేర్ అని వివరించారు. స్టేషన్ ఘణపూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీ చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.
స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని… స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గ కేంద్రంలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని తెలిపారు. వేలేర్ ,చిల్పుర్ ,దర్మసాగర్ మండలాలకు రాజయ్య , నేను ,పల్లా కలిసి నీళ్లు తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. నాకు రాజకీయ జన్మ ఇచ్చింది స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గమని… రాజకియంలో ఉన్నన్ని రోజులు నితిగా నిజయితిగా ఉంటానని చెప్పారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.