‘ప్రకృతి’ చేత పాట పాడించిన కీరవాణి..మనసును ఆహ్లాదపరుస్తున్న RRR సంగీతం

-

జీనియస్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చూసి ప్రపంచం తరిస్తోంది. జక్కన్న సామాన్యుడు కాదు.. ఆయన గొప్ప దర్శకుడని సామాన్యుల నుంచి మొదలుకుని సినీ, రాజకీయ ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరు కొనియాడుతున్నారు. ఈ చిత్రంలో సంగీతం కూడా ప్రధానమైనదని చెప్పొచ్చు. ఎం.ఎం.కీరవాణి అందించిన మ్యూజిక్ మూవీని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్లింది. చిత్ర సన్నివేశాలను ఇంకా హైలైట్ చేయడంతో పాటు ప్రేక్షకులలో భావోద్వేగం కలిగించింది సంగీతం.

ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం మాత్రమే కాదు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. RRR ఫిల్మ్ చూస్తున్న క్రమంలో ప్రేక్షకులు సీటు అంచున ఉండేలా సంగీతం డిజైన్ చేశారు కీరవాణి. దేశభక్తి పాటలో ప్రతీ ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకునేలా చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్రంలో ‘కొమ్మ ఉయ్యాలా’ పాట పాడిన గాయని రికార్డింగ్ వీడియోను కీరవాణి తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.

ఈ పాట పాడినపుడు గాయని ‘ప్రకృతి’ వయసు కేవలం మూడేళ్లేనని పేర్కొంటూ రికార్డింగ్ వీడియోను విడుదల చేశారు ‘ఆర్ఆర్ఆర్’ మ్యూజిక్ డైరెక్టర్. ప్రతిభ కలిగిన ఆ అమ్మాయి పాడిన పాటను విని నెటిజన్లు సంబురపడుతున్నారు. మల్లి పాత్రను ఛండీగర్ కు చెందిన అమ్మాయి ట్వింకిల్ శర్మ పోషించింది.ఈ పాత్రతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.

అలా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో కీలకమైన పాటను మూడేళ్ల చిన్నారి ప్రకృతి పాడిందా అని తెలుసుకుని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ స్టోరిని మలుపుతిప్పే మల్లి పాత్రకు ప్రేక్షకులు వంద మార్కులు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది.

‘కొమ్మ ఉయ్యాలా.. కోన జంపాల.. అమ్మ ఒళ్లో నేను రోజు ఊగాలా .. రోజు ఊగాలా..’ అంటూ అమ్మాయి పాడగా, ఈ పాటను 2019 మార్చి 15న హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో రికార్డు చేసినట్లు కీరవాణి పేర్కొన్నారు. గాయని ప్రకృతికి ఇంకా మంచి భవిష్యత్తు ఉందని, చక్కటి అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా నెటిజన్లు చెప్తున్నారు. ఈ మేరకు వారు ట్వీట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news