హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఈ రోజు ఎంఎంటీఎస్ సర్వీసులు పాక్షికంగా రద్దు అయ్యాయి. సోమవారం రెండు జంట నగరాల్లో ఉండే పలు రూట్లల్లో 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సాంకేతిక కారణాల తో పాటు ట్రాక్ మరమ్మతులు చేయడం వల్ల 36 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్టు తెలిపారు. ఎంఎంటీఎస్ తోపాటు విశాఖ పట్నం – నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ రైలును కూడా రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నేడు రద్దు అయిన ఎంఎంటీఎస్ సర్వీసుల వివరాలు..
హైదరాబాద్ నుంచి లింగంపల్లి రూట్ లో 18 సర్వీసులు
ఫలకునుమా నుంచి లింగంపల్లి రూట్ లో 16 సర్వీసులు
సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి రూట్ లో 2 సర్వీసులు
విశాఖ పట్నం – నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ ( టైన్ నెంబర్ 12803)
కాగ ట్రాక్ మరమ్మతుల కారణంగా గతంలో కూడా రెండు సార్లు ఎంఎంటీఎస్ సర్వీసులకు బ్రెక్ పడింది. కాగ గతంలో సంక్రాంతి పండుగ సమయంలో ఎంఎంటీఎస్ సర్వీసులను నిలివివేశారు. కాబట్టి ప్రభావం పెద్దగా చూపలేదు. కానీ నేడు కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అయితే నేడు రద్దు అయిన ఎంఎంటీఎస్ సర్వీసులు తిరిగి మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి.