హిట్లర్ ఎలా చనిపోయాడో.. మోడీ అలానే చస్తాడు: సుబోధ్ కాంత్

-

భారతదేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ ప్రదర్శన చేపట్టిన విషయం తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు జారీ చేసి.. విచారణ జరుపుతోంది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత సుబోధ్ కాంత్ సాహో.. ప్రధాని మోడీని తీవ్రంగా విమర్శించారు. అగ్నిపథ్ స్కీమ్‌ వల్ల నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఒక వేళ మోడీ.. హిట్లర్ తరహాలో పాలన కొనసాగిస్తే.. మోడీ కూడా హిట్లర్ లాగానే చనిపోతాడని తీవ్రంగా విమర్శించారు.

సుబోధ్ కాంత్
సుబోధ్ కాంత్

ఈ క్రమంలో మాజీ మంత్రి చిదంబరంపై కూడా విమర్శలు చేశారు. చిదంబరం కూడా పకోడీలు వేయడం నేర్చుకుంటే.. తను కూడా అగ్నివీరుడు కావొచ్చని కామెంట్ చేశారు. ఒకవేళ సైనికులే కావాలని అనుకుంటే దరఖాస్తు కూడా అవసరం లేదన్నారు. కేవలం డ్రైవర్, వాషర్ మెన్, బార్బర్, చౌకీదార్ కావాలని అనుకుంటే అగ్నివీర్ కావాలని హితువు పలికారు. కాగా, దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పథకంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయని, కానీ కేంద్రం ఆ విషయాన్నే పట్టించుకోకుండా నోటిఫికేషన్ విడుదల చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news