కే‌సి‌ఆర్ ‘ హెలీకాప్టర్ ‘ కే మోడి ఓటు ?? రేపే ప్రకటన ?

-

కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ తీసుకున్న నిర్ణయం వల్ల దేశం లో భయంకరమైనా ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఇలాంటి సంక్షోభం నుంచి బయటపడాలంటే హెలికాప్టర్ మనీ విధానాన్ని అమలు చేయాలని కేసీఆర్ సూచించారు. ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించిన టైములో కే‌సి‌ఆర్ ఈ విధానాన్ని ప్రధాని మోడీ తో  చర్చించటం జరిగింది. తాజాగా ఇదే విషయాన్ని కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. ప్రపంచంలో ఇలాంటి సంక్షోభం ఎదురైనప్పుడు దాదాపు అన్ని దేశాలు ఈ పద్ధతినే అనుసరిస్తారు అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.KCR and Modi, a Tale of Two Leaders Who Are Different But Similarప్రధాన మోడీ తో వీడియో కాన్ఫరెన్స్ జరిగిన తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో కే‌సి‌ఆర్ ఈ విషయాలు చెప్పుకొచ్చారు. 1918లో అదేవిధంగా 2008వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడిన టైములో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధులు లేని సందర్భంలో.. కేంద్రమే రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సి ఉంది. ఆ టైంలో అవలంబించే విధానం క్వాంటిటేటివ్ ఈజింగ్ (క్యూఈ). ప్రస్తుతం దేశంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం నుండి రాష్ట్రాలను కాపాడాలంటే మోడీ క్వాంటిటేటివ్ ఈజింగ్ (క్యూఈ) అమలు చేయాలని కోరినట్లు తేలిపారు. లాక్ డౌన్ వల్ల దేశంలో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్థికంగా చాలావరకు నష్టపోయాయి. ఇటువంటి టైములో అన్ని రాష్ట్రాలలో ఉన్న పారిశ్రామికవేత్తలు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నారు.

రైతుల నుంచి ధాన్యం కొనాలన్నా ఇంకేదైనా చేయాలన్నా క్యూఈ ద్వారా వచ్చే డబ్బుతో మాత్రమే ఆదుకో గలరని మోడీకి చేపినట్లు కే‌సి‌ఆర్ చెప్పుకొచ్చారు. ప్రపంచ దేశాలలో ఈ విధానాన్ని హెలికాప్టర్ మనీగా వ్యవహరిస్తారు. టాప్ బ్యాంకు అయిన ఆర్బీఐ ఈ డబ్బు ఇస్తుంది కాబట్టి దీన్ని అలా వ్యవహరిస్తారు. ఈ విషయాన్ని నేను ప్రధానికి వివరించాను. నేను పూర్తిగా దీని గురించి ఆయనకు దీని గురించి చెప్పాను. మరో ఇద్దరు ముగ్గురు సీఎంలు కూడా దీని గురించి ప్రస్తావించారు.’’ అని కేసీఆర్ వివరించడం జరిగింది.

ఇటువంటి నేపథ్యంలో ఒక పక్క లాక్ డౌన్ మరోపక్క దేశంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం గురించి అధికారులతో చర్చించిన మోడీ.. కే‌సి‌ఆర్ తన దృష్టికి తీసుకు వచ్చిన ‘హెలీకాప్టర్’ మనీ విధానానికి ఓటు వేయటానికి రెడీ అయ్యారట. కేంద్రమే  రాష్ట్రాలను ఆదుకునే విధంగా మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీలో వార్తలు వినబడుతున్నాయి. రేపు మోడి ఉదయం 10 కి జాతినుద్దేశించి .. లాక్ డౌన్ మీద నిర్ణయం చెప్పిన తరవాత కే‌సి‌ఆర్ ఇచ్చిన హెలీకాప్టర్ సలహా గురించి ప్రస్తావించినా ప్రస్తావించక పోయినా .. హెలీకాప్టర్ మనీ ని దేశం మొత్తం ఇంప్లిమెంట్ చేసే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తోంది .. కీలక సమయం లో దేశాన్ని కాపాడే ఈ హెలీకాప్టర్ మనీ అంశం రేపు హై లైట్ కాబోతోంది అని టాక్.

 

Read more RELATED
Recommended to you

Latest news