మోదీ సర్కార్ కొత్త పన్ను విధానాన్ని తీసుకొచ్చింది. తొలిసారిగా రెండు విడివిడి పన్ను చెల్లింపు విధానాలను ప్రకటించడం జరిగింది. అయితే అవి విజయవంతం అవుతాయని అంటోంది. కేవలం 5 శాతం మంది ట్యాక్స్ పేయర్లు మాత్రమే ఈ కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. ఇది ఇలా ఉంటే మోదీ సర్కార్ కొత్త పన్ను వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మార్చేలా కనపడుతోంది అని ఎక్స్పర్ట్స్ చెప్పడం జరిగింది. అందుకని బడ్జెట్‌లో ట్యాక్స్ స్లాబ్స్‌కు సంబంధించి మోదీ సర్కార్ ముఖ్యమైన ప్రకటనలు చేయొచ్చని తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే కొత్త పన్ను విధానం కార్పొరేట్ ట్యాక్స్ పేయర్లకు బాగా సరిపోయిందని చెప్పవచ్చు. దీని వలన వాళ్లకి చాలా రిలీఫ్ గా ఉండనుంది. ఇండివీజువల్ ట్యాక్స్ చెల్లించే వారు మాత్రం ఈ విధానానికి దూరంగా ఉన్నారనే చెప్పాలి. అయితే ఈ కొత్త పద్దతి వలన పన్ను మినహాయింపు ఆప్షన్ సరిగా లేదనే విషయాన్ని తర్వాత ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించడం జరిగింది. అలానే కొత్త పన్ను విధానం వల్ల ప్రజల సేవింగ్స్‌పై కూడా ప్రభావం పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
ఎందుకంటే ఈ పద్దతి వలన సేవింగ్ స్కీమ్స్ లాంటివి ఏమి వుండవు. కానీ పాత పద్దతిని చూస్తే చాలా మంది ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ లోనే డబ్బులు దాచుకుంటున్నారు. భవిష్యత్‌లో అత్యవసర పరిస్థితుల్లో ఇవి అవసరం అవుతాయి. రిటైర్ అయ్యాక ఇవి అవసరం అవుతాయి. అందువల్లనే పాత పద్దతే మంచిది అని చాలా మంది అభిప్రాయం. అందుకే కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి పన్ను మినహాయింపు ప్రకటనలు చేయొచ్చని అర్ధం అవుతోంది. హోమ్ లోన్ ట్యాక్స్ మినహాయింపు, స్టాండర్డ్ డిడక్షన్ వంటి వాటిని కొత్త పన్ను విధానంలో చేర్చేలా కనపడుతోంది. అధిక ట్యాక్స్ స్లాబ్ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచొచ్చని కూడా తెలుస్తోంది.