పొత్తుపై బాబు సైలెంట్..పవన్ లెక్కలతో చిక్కులు?

-

ఏపీలో పొత్తుల అంశంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకునే దిశగా ముందుకెళుతున్నట్లు ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకుని వైసీపీకి చెక్ పెడతాయని చర్చ నడుస్తోంది. పైగా జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనే లెక్కలు కూడా బయటకొస్తున్నాయి. అటు టీడీపీ-జనసేనతో బీజేపీ లేదా కమ్యూనిస్టులు కలిసే అవకాశాలు ఉన్నాయని కూడా ప్రచారం నడుస్తోంది.

tdp party janasena partyఅయితే పొత్తులపై ఇప్పుడేమీ మాట్లాడనని చంద్రబాబు తేల్చేశారు. అసలు ఇప్పుడు పొత్తుల అంశం ఊహాజనితమని, ఇప్పుడు దాని గురించి ఏమి మాట్లాడలేదని చంద్రబాబు చెప్పేశారు. అంటే పొత్తుల గురించి బాబు ఇప్పుడే పట్టించుకునేలా కనబడటం లేదు. నెక్స్ట్ ఎన్నికల ముందు పరిస్తితి బట్టి బాబు డిసైడ్ అయ్యేలా ఉన్నారు. ఈలోపు టీడీపీని మరింత బలోపేతం చేయాలని బాబు చూస్తున్నారు.

ఎందుకంటే ఎన్నికల్లోపు బలపడితే సొంతంగానే పోటీ చేసి సత్తా చాటవచ్చు. అప్పుడు పొత్తు అవసరం ఉండదు. లేదంటే జనసేనతో సీట్ల విషయంలో రచ్చ జరగొచ్చు. పైగా సీట్ల విషయంలో పవన్ అనేక్ల డిమాండ్లు తెరపైకి తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ఎలాగో పొత్తు టీడీపీకే అవసరమనే కోణంలో పవన్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే జనసేనకు సొంతంగా గెలిచే సత్తా లేదు. కాకపోతే విడిగా పోటీ చేస్తే టీడీపీ ఓట్లు చీల్చి…వైసీపీకి బెనిఫిట్ అయ్యేలా చేస్తుంది. అందుకే టీడీపీకి, జనసేన అవసరం చాలా ఉంది. అందుకే పవన్ ఎక్కువ డిమాండ్లు చేస్తున్నట్లు తెలిసింది.

ఎక్కువ సీట్లు తీసుకోవాలని పవన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే టీడీపీకి నష్టం జరుగుతుంది. టీడీపీ నాయకులు సీట్లు కోల్పోవాలి. ఈ పరిస్తితి వల్ల టీడీపీకి డ్యామేజ్ అవుతుంది. అందుకే ఇప్పుడే పొత్తుల గురించి మాట్లాడటానికి బాబు ఆసక్తిగా లేరు. ఎన్నికల్లోపు పార్టీని ఇంకా బలోపేతం చేసుకుని, అప్పుడు పరిస్తితిని బట్టి ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news