ప్రధాని మోడీ హైదరాబాద్‌ షెడ్యూల్‌ ఇదే..కేసీఆర్ డుమ్మా !

-

ప్రధాని మోడీ ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ పర్యటనలో భాగంగా.. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించడంతో పాటు రూ. 11,355కోట్ల విలువగల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ. రెండు గంటల పాటు మోడీ హైదరాబాద్ లో ఉండనున్నారు.

ఉదయం 11. 30 గంటలకు మోడీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్తారు. 11. 45 గంటల నుంచి 12.05 గంటల వరకు అక్కడే ఉంటారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను మోడీ ప్రారంభిస్తారు. ఆ తర్వాత 12. 15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు, Aims కొత్త భవనాల నిర్మాణం, జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు మోడీ. 12.50 నుంచి 1.20 గంటల వరకు ప్రసంగించననున్నారు. ఆ తర్వాత 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు చేరుకొని తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక మోడీ కార్యక్రమంలో..తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ సారి.. పాల్గొనడం లేదు.

 

Read more RELATED
Recommended to you

Latest news