ఇప్పటి వరకు వరల్డ్ కప్ చరిత్రలోనే ఎ సీజన్ లోనూ నమోదు కాని రికార్డు, ఈ సీజన్ లో నమోదు అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే ఆతిధ్య ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న వన్ డే వరల్డ్ కప్ లో చివరి అంకానికి చేరుకున్నాం. ఇండియా మొదటి సెమి ఫైనల్ లో కివీస్ ను ఓడించి ఫైనల్ కు చేరుకోగా, రెండవ ఫైనలిస్ట్ కోసం మ్యాచ్ జరుగుతోంది. కాగా ఈ వరల్డ్ కప్ లో 48 ఏళ్ల చరిత్ర ఉన్నా ఇప్పటి వరకు నమోదు కాని రికార్డు ఈ రోజు మ్యాచ్ లో నమోదు అయింది. ఒక సీజన్ లో నమోదు అయిన అత్యధిక సెంచరీ ల రికార్డు తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సీజన్ లో ఈ రోజు డేవిడ్ మిల్లర్ సెంచరీ తో సహా సెంచరీ లు నమోదు అయ్యాయి. ఈ 39 సెంచరీ లలో డికాక్ 4, కోహ్లీ రవీంద్ర చెరో 3, మిచెల్ , శ్రేయాస్, వార్నర్, డస్సెన్, మార్షన్, మాక్స్ వెల్ లు తలో రెండు సెంచరీ లు చేశారు.
ఇక రోహిత్ శర్మ, మార్ క్రామ్, మలన్ మరియు రాహుల్ తో పాటు ఇంకా కొందరు ఒక్కో సెంచరీ నమోదు చేసి ఈ రికార్డు లో భాగం అయ్యారు.