వారసత్వం, అవినీతి అనే రెండు చెదపురుగులు భారత్‌ను పట్టిపీడిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపణలు చేశారు. ఈ రెండింటిని అంతమొందిస్తే భారత ప్రజాస్వామ్య మనుగడకు సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. అవినీతి, వారసత్వాలను జనజీవనం నుంచి పూర్తిగా తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించినప్పుడే సామాన్యుల జీవితం మెరుగుపడుతుందన్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా అవినీతిపై భారీ ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అవినీతిపరులను క్షమిస్తే దేశ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతోందన్నారు. ప్రజలు అవినీతిపరులపై ఉక్కుపాదం మోపాలన్నారు. దేశంలో వారసత్వంపై మాట్లాడితే రాజకీయ భావనగా విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందన్నారు. వారసత్వ వ్యతిరేక ఉద్యమంలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.