గవర్నమెంట్‌ కంటే..ప్రైవేట్‌లో జీతాలు ఎక్కువ..ప్రైవేట్ ఉద్యోగాలు ఎంచుకోవాలి – హరీష్ రావు

-

ప్రభుత్వ ఉద్యోగ జీతం కంటే ప్రైవేట్ ఉద్యోగం జీతాలు ఎక్కువ అందుకే కొంత మంది ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎంచుకోవాలని మంత్రి హరీష్‌ రావు సూచించారు. సిద్దిపేటలోని బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ పొందిన విద్యార్థులకు పుస్తకాలు పంపిన చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు.

ఈ సందర్భం గా హరీష్ రావు మాట్లాడు తూ… రానున్న రోజుల్లో 95 వేల ఉద్యోగుల ఇస్తాం..అన్ని నోటిఫికేషన్ ఒక్కసారిగా ఇస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి దశల వారిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఉద్యోగాల సంవత్సరం గా మారనుందని.. కేంద్రం పరిధిలో దాదాపు 15 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.

3 సంవత్సరాల నుంచి కేంద్రం ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. కేంద్రం పైన ఒత్తిడి తెస్తాం. నోటిఫికేషన్ వేయాలని డిమాండ్ చేస్తామని తెలిపారు. కేంద్రం ఉద్యోగాలు కల్పించకుండా ఉన్నా ప్రభుత్వ ఆస్తులను అమ్ముతుందని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news