బోయిగూడ ప్రమాదంపై మోడీ దిగ్భ్రాంతి..రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన

-

హైదరాబాద్ బోయిగూడలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. టింబర్, స్క్రాప్ డిపోలో చెలరేగిన మంటలతో 11 మంది కార్మికులు సజీవదహనం అయ్యారు. మొత్తం ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నారు. తెల్లవారుజాములు టింబర్ డిపోలో మంటలు చెలరేగుతున్నాయి. మొత్తం 12 మంది కార్మికుల్లో ఇద్దరిని అధికారులు కాపాడారు.

మృతదేహాలను వెలికి తీసేందుకు రెస్య్కూ ఆపరేషన్ చేపడుతున్నారు అధికారులు. అయితే… బోయిగూడ అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి అయ్యారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించిన ప్రధాని.. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటన చేశారు. అటు బోయిగూడ అగ్ని ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతి చెందిన బీహార్ కార్మికులకు సంతాపం తెలిపిన కేసీఆర్‌.., బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనలో మృతి చెందిన కార్మికుల మృతదేహాలను సొంతరాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని చీఫ్‌ పెక్రటరీని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news