కరోనా పరిక్షల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ఆదేశాలు జారీ చేసారు. ప్రతీ ఒక్కరికి అందుబాటులోకి పరీక్షలను తీసుకు రావాలని వైద్య ఆరోగ్య శాఖను ఆయన ఆదేశించారు. నిన్న ఆయన కరోనా పరిక్షా సదుపాయాలు, కాంటాక్ట్ ట్రేసింగ్ సహా అనేక విషయాల మీద సమీక్షా సమావేశం నిర్వహించారు. సెరో సర్వేలు మరియు పరీక్షలను రెండింటినీ తప్పక పెంచాలని ప్రధాని ఆదేశించారు.
క్రమం తప్పకుండా, వేగంగా మరియు చవకగా పరీక్షించే సదుపాయం అందరికీ త్వరగా అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ విషయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమగ్ర పంపిణీ మరియు డెలివరీ యంత్రాంగాన్ని సిద్దం చేసుకోవాలని ఆయన సూచించారు. సేకరణ విషయంలో కూడా దృష్టి పెట్టమని చెప్పారు. సాంప్రదాయ ఔషధాలు కరోనాకు ఉపయోగపడతాయని వాటిని వినియోగించుకోవాలని చెప్పారు. గ్రామ స్థాయిలో కరోనా పరీక్షలను విస్తరించాలని ప్రధాని ఆదేశించారు.