ఆసియా కప్ కు ముందు పాక్ కు బిగ్ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. ఆ జట్టు స్టార్ పెసర్ షహీన్ షా ఆఫ్రిది గాయం కారణంగా ఆసియా కప్ కు దూరమయ్యాడు. ప్రస్తుతం షహీన్ షా ఆఫ్రిది మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఈ ఏడాది జులైలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఫీల్డింగ్ చేస్తుండగా ఆఫ్రిది గాయపడ్డాడు.
దీంతో అతడు శ్రీలంకతో ఆఖరి టెస్ట్ తో పాటు నెదర్లాండ్స్ తో జరిగిన వన్డే సిరీస్ కు కూడా దూరమయ్యాడు. అయితే.. షాహీన్ స్థానంలో ఆ జట్టు యువ పేసర్ మహ్మద్ హస్నైన్ ను పాక్ బోర్డు ఎంపిక చేసింది. హస్నైన్ 2019 లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ లో పాక్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
ఇప్పటి వరకు తన కెరీర్ లో 8 వన్డేలు, 18 టీ 20 మ్యాచ్ లు పాక్ హస్నైన్ తరఫున ఆడాడు. అతడు ఇప్పటి వరకు వన్డేల్లో 18 వికెట్లు, టీ 20 ల్లో 17 వికెట్లు కూడా తీశాడు. అయితే.. పేసర్ మహ్మద్ హస్నైన్ బౌలింగ్ యాక్షన్ గతంలో అభ్యంతరాలు వచ్చాయి. త్రో బౌలింగ్ వేస్తాడంటూ ఆరోపణలు ఉండటం గమనార్హం.
JUST IN: Mohammad Hasnain to replace Shaheen Afridi in Asia Cup squad.
Details ⬇️
— ICC (@ICC) August 22, 2022