బ్రేకింగ్ : ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతి

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. నిన్నటి నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో పాటు… పిడుగులు పడటం ప్రజలను వణికిస్తోంది. ఇక తాజాగా ఇవాళ పిడుగుపాటుకు తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా నలుగురు మృతి చెందారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఈ నలుగురు వ్యక్తులు పిడుగుపాటుకు మరణించడం గమనార్హం.

ఆదిలాబాద్ జిల్లా బజార్త్నూర్ మండలం తుర్కపల్లి గ్రామం లో ఇద్దరూ దంపతులు మృతి చెందారు. బుర్కా పల్లి గ్రామానికి చెందిన బనియా గరన్ సింగ్ 45 సంవత్సరాలు మరియు ఆశా భాయి 33 సంవత్సరాలు ఉన్న ఇద్దరు భార్యాభర్తలు ఇవాళ పిడుగుపాటుకు మృతి చెందారు.

వ్యవసాయ పనుల్లో భాగంగా ఇవాళ… తమ చేను వద్దకు వెళ్లిన… వీరిద్దరిపై పిడుగు పడింది. దీంతో అక్కడికక్కడే ఆ దంపతులు మృతి చెందారు. అలాగే అదిలాబాద్ జిల్లాలోని జైనూర్ మండలం లో ఒకరు, తాంసీ మండలం లో మరొకరు పిడుగుపాటుకు మృతి చెందారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.