ఈ రోజు ఉదయం 11 .30 గంటలకు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10 వ తేదీన ఎన్నికలు మరియు అదే నెల 13 వ తేదీన దాని ఫలితాలు వెలువడించనున్నారు. కాగా ఈ క్షణం నుండి కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో డబ్బు సరఫరా జరుగుతుండగా CEC అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారట.
అంతే కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ కు ముందుగా దాదాపుగా 80 కోట్ల డబ్బు మరియు ఇతర వస్తువులను సీజ్ చేశారట. దీనితో కర్ణాటక రాష్ట్ర సరిహద్దులలో ఉన్న అన్ని చెక్ పోస్ట్ లను భారీ బాలగంతో పటిష్టంగా చేయనున్నారు. ఇక నేటి నుండి కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందా లేదా కాంగ్రెస్ జేడీఎస్ ల కూటమికి అవకాశం ఉందా అన్నది తెలియాల్సి ఉంది.