ఓ వైపు కరోనాతో సతమతమవుతున్న ప్రజలపై వైరస్‌లు దండయాత్ర మొదలుపెట్టాయి. ఇప్పటికే కరోనాతో పాటు జికా వైరస్‌లు దేశంలో వ్యాప్తి చెందుతుండగా.. ఇప్పుడు దానికి మంకీపాక్స్ తోడైంది. ఈ మహమ్మారి తొలికేసు కేరళలో నమోదైంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్ వెల్లడించారు. ఈ నెల 12న యూఏఈ నుంచి తిరువనంతపురానికి వచ్చిన కొల్లాంకు చెందిన వ్యక్తికి మంకీపాక్స్ నిర్ధారణ అయినట్లు తెలిపారు వీణాజార్జ్..అయితే దేశంలో తాజాగా నమోదవుతున్న మంకీ ఫాక్స్ కేసుల పట్ల అప్రమత్తమైంది కేంద్ర ఆరోగ్య శాఖ.
మంకీ పాక్స్ వ్యాధి నివారణ కోసం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.అయితే ఇప్పటికే తొలి మంకీ పాక్స్ కేసుతో భయాందోళనలకు గురవుతుండగా తాజాగా కన్నూరు జిల్లాలో మరో కేసును అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన 31 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానించగా.. తాజాగా వచ్చిన నివేదికల్లో అతడికి మంకీ పాక్స్ నిర్ధారణ అయింది. దీంతో కేరళ రాష్ట్రంలో మంకీ ఫాక్స్ కేసుల సంఖ్య 2కు పెరిగింది.