అమెరికాలో మృత్యు క్రీడ…!

-

అవును అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా మృత్యు క్రీడ ఆడుతుంది. ప్రపంచం మొత్తాన్ని కరోనా ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో గాని అమెరికాకు మాత్రం ఇది చుక్కలు చూపిస్తుంది. అక్కడ ఇప్పటి వరకు 2 లక్షల 20 వేల మందికి కరోనా వైరస్ సోకింది. అక్కడ మరణాల సంఖ్య 5 వేలకు చేరువలో ఉంది. ట్రంప్ ఊహించిన విధంగానే అక్కడ కరోనా వైరస్ వేగంగా పెరగడమే కాదు మరణాలు కూడా పెరుగుతున్నాయి.

కరోనా కేసులు ఎక్కువగా ఆరు రాష్ట్రాల్లో నమోదు అవుతున్నాయి. అక్కడే మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అక్కడ కరోనా మరణాలు నిన్న ఒక్క రోజే 884గా నమోదు అయ్యాయి. దీనితో మరణించిన వారి సంఖ్య 5,093కు చేరుకుంది. 2లక్షల 14వేల మంది ఈ వైరస్‌ పడ్డారని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మీడియాకు వివరించారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదు కావడం గమనార్హం.

ప్రపంచ వ్యాప్తంగా 9 లక్షల మందికి కరోనా సోకగా వారిలో దాదాపు 48 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 935,957 మందికి కరోనా సోకింది. ఈ సంఖ్య రెండు రోజుల నుంచి రెట్టింపు అవుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితుల సంఖ్య 132 కి చేరుకుంది. తెలంగాణాలో 127 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రెండు వేలు దాటినట్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news