ఉదయం తినడం మానేయద్దు… క్షణాల్లో తయారయ్యే బ్రేక్‌ఫాస్ట్ ఐడియాస్ ఇవే… ట్రై చేసేయండి..

-

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఆఫీస్ కి వెళ్లే హడావిడిలో బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్ ని స్కిప్ చేయడం వలన ఆరోగ్యం పాడవుతుంది. అందుకని ఖచ్చితంగా ఏదో ఒకటి తినేసి వెళ్లాలి. బాగా టైం తీసుకునే ఆహార పదార్థాలు కంటే క్షణాల్లో తయారయ్యే బ్రేక్ఫాస్ట్ ని తయారు చేసుకుని తీసుకుంటే టైమ్ సేవ్ అవుతుంది. మరి క్షణాల్లో ఎటువంటి బ్రేక్ ఫాస్ట్ ని తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కార్న్ ఫ్లేక్స్:

కార్న్ ఫ్లేక్స్ ని మీరు ఉదయాన్నే తీసుకోవచ్చు. పాలల్లో కార్న్ ఫ్లేక్స్ వేసుకుని తినడం బెస్ట్. త్వరగానే దీన్ని తయారు చెయ్యచ్చు. టైం పట్టదు. దీని వల్ల బరువు తగ్గుతారు కూడా.

ఓట్స్:

ఓట్స్ లో ఫైబర్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కనుక ఓట్స్ తో చేసే బ్రేక్ఫాస్ట్ ని తీసుకుంటే మంచిదే. పాలల్లో ఓట్స్ వేసుకుని తినచ్చు. లేదంటే ఓట్స్ ఉప్మా వంటివి కూడా చేసి తీసుకోవచ్చు. మరి ఓట్స్ రెసిపీస్ ని కూడా చూసేద్దాం.

ఓట్స్ ఉప్మా:

దీని కోసం ముందుగా ఉల్లిపాయ, టమాట, పచ్చిమిరప కాయలు, క్యారెట్, బీన్స్ ని కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తరవాత పాన్ పెట్టి పోపుకు సరిపడు నూనె వేసి… వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినపప్పు వేసి వేయించండి. అల్లం ముక్కలు కూడా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. ఆ తరవాత ఇందాక తరిగిన కోరాలని వేసుకోండి. కూరగాయలన్నీ బాగా మగ్గిన తరువాత ఒక కప్పు ఓట్స్ కి ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టి బాగా మరిగించాలి. బాగా నీళ్లు మరిగాక ఓట్స్ వేసి ఉడికించండి అంతే. క్షణాల్లో ఓట్స్ ఉప్మా రెడీ.

సూజీ:

ఇది రొటీన్ గా మనం చేసే ఉప్మా ఏ. ఉప్మా రుచిగా ఉంటుంది, శక్తినిస్తుంది కూడా. బరువు తగ్గడానికి కూడా అవుతుంది.

గోధుమరవ్వ:

ఇది కూడా త్వరగా చేసుకోగలిగే బ్రేక్‌ఫాస్ట్ ఏ. ఫైబర్, ప్రొటీన్స్ ఇందులో ఉన్నాయి. దాలియాని పాల లో ఉడకబెట్టి మీకు నచ్చే పండ్ల ముక్కలతో కలిపి తినచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news