తెలంగాణలోని MMTS ఫేస్ -2 పనులపై కేంద్రం కీలక ప్రకటన

-

తెలంగాణలో రైల్వే ప్రాజెక్ట్ పై డా.లక్ష్మణ్ ప్రశ్న.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. రైల్వే ప్రాజెక్టులు జోనల్ వారీగా, డివిజన్ వారీగా మంజూరు అవుతాయి. వాటిలో కొన్ని సార్లు రాష్ట్రాల సరిహద్దులు కూడా మారుతుంటాయి…ఏప్రిల్ 1, 2022 వరకు రూ.30,062 కోట్ల విలువైన 2,930కిమీల రైల్వే లైన్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందులో 8 కొత్తలైన్లు, 5 డబ్లింగ్ లైన్లు ఉన్నాయన్నారు. మార్చి 22కళ్లా రూ.6,514 కోట్ల విలువైన 272 కిలోమీటర్ల రైల్వే లైను పూర్తి అయ్యింది. 8 కొత్తలైన్లలో 1053 కి.మీలకు రూ.16,686 కోట్ల అంచనాలతో పనులు ప్రారంభించగా రూ.3,596 కోట్ల విలువైన 221కి.మీల లైన్ పూర్తి అయ్యిందని రైల్వే మంత్రి వెల్లడించారు.

తెలంగాణలో MMTS ఫేస్ -2 కోసం రూ.816.55 కోట్లు అంచనా వేయగా ఈ ఖర్చు రైల్వే, తెలంగాణ ప్రభుత్వం 1:2 నిష్పత్తిలో భరించాల్సి ఉంది. ఇందులో 544.36 కోట్లు తెలంగాణ రాష్ట్రప్రభుత్వ వాటా ధనంలో కేవలం 279.02 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. మిగిలిన 265.34 కోట్ల కోసం కేంద్ర రైల్వే శాఖ అనేకమార్లు తెలంగాణ సర్కార్ కు లేఖలు రాసినా పెడచెవిన పెట్టిందని తెలిపారు. MMTS ఫేస్ -2 కోసం కేంద్ర రైల్వే శాఖ తన వాటా ధనం కన్నా అధికంగా కేటాయించింది. ఈ ప్రాజెక్టులు ఎక్కడా కూడా తెలంగాణ భూములు అవసరం కూడా రాలేదని ఫైర్‌ అయ్యారు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్.

 

Read more RELATED
Recommended to you

Latest news