మార్నింగ్ రాగా : అల‌సినచో..అక్ష‌రాన్ని..

-

ఫ‌స్ట్ కాజ్ : య‌వ్వ‌న్నాన్ని అంతా ప్రేమకు ధార‌పోశాక

కార‌ణాల‌న్నీ అన్వేష‌ణ‌లో ఉంచి పోయాక..ఇప్పుడు రాస్తున్న లేఖ‌లకు ఏద‌యినా ఒక పేరు కేన్ యూ ఛూజ్ ద‌ట్ మిగిలిన‌వి పార‌బోయాలి..మౌనం మిగిలి ఉంది ఎలా? అస‌లు నీకు నీవు మిగ‌ల‌డం అన్న‌ది ఎంత హాయో! చుట్టూ ఉన్న వారంతా నిన్ను నీలా ఉంచ‌రు..ఆ ప్రేయ‌సి కూడా నీ మౌనాల‌ను జుర్రుకుని బ‌దులుగా..ఒకింత మోహార్తిని కానుక‌గా ఇచ్చినందుకు సంభ్ర‌మ అన్న‌ది ఒక్క‌టి పొంది..నీ నుంచి జారి పోతుంది. నీడ జారిపోతుంది..విడువ‌డి త‌డ‌బ‌డి క‌ల‌బడిన ప్ర‌తి క్ష‌ణం జారిపోతోంది.

అవును! ఓయ్ పిల్లా! ఇచ్చిన కానుక‌ల‌న్నీ కాలం విడిదింట జాగ్ర‌త్త! విస్తుబోయిన ప్రేమ అంతా ఇదిగో ముందున్న మ‌నుషులు ముందున్న రోజులు..జాగ్ర‌త్త‌గా త‌మకు అర్థం అయినంత‌గా  దాచుకుంటాయి.. ప్రేమ ఏమ‌యినా అడిగితే ఒక క‌ర్మ‌రీ వాక్యాన్నీ కానుక‌గా ఇవ్వాలి..ఎందుక‌నో అని మాత్రం అడ‌గ‌కేం.. ఇప్పుడో ఎప్పుడో ఈ సాయంకాల గాలుల‌కో కొత్త అన్వ‌యం నేర్పితే ఆ న‌డ‌క‌ల ఊగిస‌లాట‌లే నీ న‌ట‌న‌ల‌కు అనున‌యింపులు కావొచ్చు.. ప్రేమ కొన్నింట శ‌త్రు సంబంధం.. న‌ట‌న సంబంధం.. అప్రియ సంబంధం కూడా! న‌వ్వుకున్నాను నేను ! త‌త్ స‌మాన శ‌త్రువు అయితే ప్రేమ లేకుంటే ప్రేమ పేరిట అమ‌లుకు నోచుకున్న కోరిక.. అందుక‌నో ఎందుక‌నో ప్రేమ ద్వి మాత్ర కోరిక ఏక మాత్ర.. క్ష‌ణికాల‌న్నీ యుద్ధ సంబంధిత రాగ ద్వేషాలే..ఒక‌వేళ ప్రేమ పేరిట మొద‌ల‌యిన మోహితం.. క్ష‌ణికం అయితే యుద్ధం దేహ సంబంధం అవుతుందా! కాదు రేయి నీడ‌ల పొద‌రింట తేలిన కోరిక.. కాగ‌ల‌దు..తేల‌ని య‌వ్వ‌న వాంఛ కూడా కాగ‌ల‌దు..

సాయంకాలాల‌ను ఏమ‌యినా అడిగితే చిన్న‌బోతాయి..ఉద‌యాల‌ను ఏమ‌యినా ఆరా తీశాక ..రేయి కౌగిళ్ల దాహాల‌ను గుర్తు చేస్తాయి. కానీ ఆ ఉద‌యం ఈ రేయీ అన్న‌వి ప్ర‌భువు ఇచ్చిన కానుక‌ల‌ని త‌నకు తెలియ‌జెప్ప‌డం బాధ్య‌త..ప్రేమ బాధ్య‌త‌గా తోచాక విడి,విడి దేహాల‌కు సందేహాల‌న్న‌వి తోచాయి..దేహాల కూడిక బాధ్య‌తల‌ను గుర్తు చేసి,ఇంకొంత నెత్తిన భారాల‌ను మోపాయి. ఊహ ఎందుకు చాంపేయం అయిందో తెలియ‌దు..అవునా! ప‌రిమళ సంబంధం వాడికి ఎందుక‌ని అబ్బ‌లేదో కూడా తెలియ‌దు. ఈ క‌వుల‌కు రాత చేత‌గాక ఎన్ని నిష్టూరాలు చెబుతారో! అయినా వాడు కొన్ని అశ్లీలార్థాలను చెప్పి వినిపించి మ‌హాప్ర‌స్థానం అని అంటాడేంటి ! రాత రానోళ్లు ఇక్క‌డ మ‌హాకవులా! తుల‌నాత్మ‌క‌త అన్న‌ది సామీప్య దేహాల్లో ఉంది సాహ‌చ‌ర్యాన్ని స్నేహ గంధాల‌నూ విడ‌దీసి నిల‌దీసి పోయిన చాలు ఒక హాయి..

చిన్న చిన్న స్ప‌ర్థ‌లు చిన్న చిన్న మౌనాలు ఎడ‌బాటుకు దూరాల‌కు అర్థాలు చెబుతున్నాయి..ప్రేమ అగాథం అని అనుకుంటే ఎ ప్పుడో దాటించేసిన చిన్ని న‌వ్వుల పులకింత‌ల్లో నీ ఊపిరి తీరాల్లో సేద‌తీర‌డం ఒక మాయ..ప్రమేయ‌..అప్ర‌మేయ అన్న‌వాటితో సంబంధం లేని స‌మ‌సిపోని బంధం ఒక‌టి నీ దేహ‌పు కౌగిలింత‌ల్లో పొందాక ఇక ఎప్ప‌టికీ ఇవ్వ‌ని వ‌రం ప్రేమ.. తగిన కాలంలో తగిన ప్రేమ ఉండ‌డం అన్న‌ది ఎంత అబ‌ద్ధం..

ఈ త‌గిన కాలం ముళ్ల‌ను పూల‌ను త‌న‌కు తాను సృష్టించి న‌డిపించి ప్రాయోగికంగా ప్రేమ‌ను మార్చిపోతుంది.. నీ అనుకునే ఈ క‌ల‌వ‌రింత ఒక్కటే ఒక గుర్తు.. ప్రేమ‌కు అక్ష‌రాల‌ను కొన్ని పోగేసి వాటికో క‌విత్వం అనే పేరు పెట్టి న వారంటే చిరాకు.. మ‌నుషులను ఇంప్రెస్ చేయ‌డం అన్న‌ది ఎంత‌టి త‌ప్పో! ఇంప్రెస్ చేసి దానిని కొన‌సాగింపు ఇవ్వాలనుకోవ‌డం కూడా అంతే త‌ప్పు! ప్రేమ స‌మ్మోహ‌నంలో ముంచిపోయిన చాలు. ఆ మాయాన్వితాలు న‌గ్న పాదాల స‌వ్వ‌ళ్ల‌ను వినిపిస్తూ పోతాయి..
మౌన ముద్రితాలు అవి ఇంకాస్త కొన‌సాగింపు ఇచ్చిపోతే బాగుండు.

కాలం ఇచ్చిన ఒక వైచిత్రి..సంధ్యా కాంతుల య‌వ్వ‌నం..మ‌ళ్లీ ధార‌బోసిన ఒక ఏకాంతం..కాంతికి చిత్తాల‌ను అందించి ఎప్పుడ‌యినా వెళ్లిపోయాక అవి అక్ష‌రాల‌ను ప‌ట్టి తెస్తాయి..ఊహ‌ల‌ను ప‌ట్టి తెస్తాయి..అవి ఇవి కూడితే క‌విత్వం అని అంటానే కానీ వీళ్లేంటి తూకం రాళ్ల‌తో దీనిని తూస్తారు అని న‌వ్వుకుంటాను..ఊహ ప్ర‌స‌రించినంత‌నే నేనుంటాను..నేనున్నాక తాను దృశ్యం..తానున్నాక నేను అదృశ్యం..దృశ్య సంబంధ భ్రాంతిని ఎక్క‌డో ఓ చోట పొందాక..ప్రేమ రంగుల లోకాల‌ను అక్షీ క‌ట‌కాల‌ను నుంచి ప‌రిచ‌యం చేసి పోతోంది..ఇప్పుడు నేను,అప్పుడు నువ్వు అంతా ఈ ఏకాంత ప‌రిష్వంగాల చెంత..కుర‌వ‌ని ఊహ‌ల‌ను కలిసిన మోహాల‌ను క‌లిపి చూపితే బంధంగా తోచింది..వీటిని ఏమంటారు ఎబోజింగ్ ఆఫ్ థాట్ అంటారు..
నీకు నేర్పుతాను..ఇంకొంత……

 

 

 

 

 

 

– ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి
శ్రీ‌కాకుళం దారుల నుంచి…

Read more RELATED
Recommended to you

Latest news