NBK107 టీజర్ కు ముహుర్తం ఖరారు..ఇక బాలయ్య ఫ్యాన్స్ కు జాతరే

-

నందమూరి బాలయ్య కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఖండ సినిమాతో బంపర్‌ హిట్‌ కొట్టాడు నందమూరి బాలయ్య. అయితే.. ఈ సినిమా తర్వాత క్రాక్ మూవీతో ఫుల్ ఫామ్ లో ఉన్న… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107 వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.


అయితే ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాన ప్పటికీ.. హీరోయిన్ ను కూడా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో శృతిహాసన్ బాలయ్య సరసన నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో టీజర్‌ టైం ను లాక్‌ చేసింది చిత్ర బృందం. ఇవాళ సాయంత్రం 6.11 గంటలకు ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేస్తామని ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా వదిలింది. దీంతో నందమూరి ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news