టెర్రరిస్ట్ ట్రైనింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలి : ఎంపీ అర్వింద్‌

-

నిజమాబాద్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశానికి నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గంలోని చెక్ డ్యాంలు కొట్టుకుపోవడానికి కారణం ఏమిటని, అధికారుల తీరు పై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనుల శంఖుస్థాపనలు ప్రారంభోత్సవాల సమాచారం ఒక రోజు ముందు రాత్రి ఇస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Hyderabad: Case filed against MP Arvind in Banjara Hills PS

ఉగ్రవాద లింకులపై స్పందించిన అర్వింద్‌.. మత ఘర్షణలకు పాల్పడే దిశగా శిక్షణలు అమానుషమని ఆయన ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రం గా భారీగా గంజాయి దందా నడుస్తుందన్న అర్వింద్‌.. టెర్రరిస్ట్ ట్రైనింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ కి ఎంపీ అరవింద్ ఆదేశించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news