పగవాడికి కూడా సిఎం జగన్ కు వచ్చిన కష్టం రావద్దు – RRR

-

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి వచ్చిన కష్టం పగవాడికైనా రావద్దని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో భాస్కర్ రెడ్డి గారి అరెస్ట్ తో పాటు, భవిష్యత్తులో అవినాష్ రెడ్డి గారి అరెస్టు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా సీబీఐని డకోట ఆర్గనైజేషన్ అని విమర్శించే సాహసాన్ని జగన్ మోహన్ రెడ్డి గారు చేయలేకపోతున్నారని, ఒకవేళ సీబీఐని ఆయన విమర్శిస్తే, ఆర్థిక నేరాభియోగ కేసుల విచారణలో గత నాలుగేళ్లుగా కోర్టుకు హాజరుకాకపోయినా మినహాయింపునిస్తున్న సీబీఐ ఆగ్రహించే అవకాశం ఉందని, జగన్ మోహన్ రెడ్డి గారు అటు బంధువుల అరెస్టుని ఖండించనూ లేక, ఇటు సీబీఐను విమర్శించనూ లేక ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.

భాస్కర్ రెడ్డి గారి అరెస్ట్ తో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి షాక్ లో ఉండి ఉంటారని, గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన తోకడా కథలన్నీ మీడియా ముందు చెప్పిన సజ్జల గారు ఇప్పటికిప్పుడు గతంలో చెప్పిన కథలన్నీ సమర్ధించుకుంటూ, కొత్త స్క్రీన్ ప్లేతో స్టోరీ చెప్పాలంటే, సినీ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి గార్ల వంటి దర్శకులతో స్టోరీ స్క్రీన్ ప్లే రాయించ వలసి ఉంటుందన్నారు. అందుకే భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పటికీ మీడియా ముందుకు రాలేకపోయి ఉంటారని, కష్టకాలంలోనే ఒకరికి ఒకరు అండగా ఉండాలని, ఈ సమయంలోనే మాట పడిపోయినట్లుగా మీడియా ముందుకు రాకపోవడం దురదృష్టకర పరిణామమని రఘురామకృష్ణ రాజు గారు అపహాస్యం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారి అరెస్టుపై లోక్ సభ స్పీకర్ గారికి ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందేమోనన్న మీడియా ప్రతినిధి ప్రశ్నపై, రఘురామకృష్ణ రాజు గారు స్పందిస్తూ అటువంటి అవసరం ఏది లేదని అన్నారు. గతంలో తనని అరెస్టు చేసిన తరువాతే లోక్ సభ స్పీకర్ గారి కార్యాలయానికి తెలియజేశారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news