వీడియో : విజిల్ కొట్టి మరీ కాలర్‌ ఎగరేసిన ఎంఎస్ ధోని..!

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ లు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. లీగ్ కోసం ఇప్పటికే యూఏఈ చేరుకున్న అన్ని ప్రాంఛైజీలు క్వారంటైన్ పూర్తిచేసుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. అయితే ఐపిఎల్-2020 ప్రారంభానికి ముందే సీఎస్కే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. మరోవైపు జట్టు ఆటగాళ్లు సెప్టెంబర్‌ 19న ముంబైతో జరుగనున్న తొలి మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, తాజాగా..  సీఎస్కే మంగళవారం తమ తాజా జెర్సీకి సంబంధించిన వీడియోను అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

ఈ వీడియోలో ఎంఎస్ ధోని, షేన్ వాట్సన్, మురళీ విజయ్ విజిల్ కొట్టి, కాలర్‌ ఎగరేస్తూ వేసిన స్టెప్‌ చెన్నై అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇకపోతే యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు మొత్తం 53 రోజుల్లో 60 ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్న సంగతి తెలిసిందే. అలాగే లీగ్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్‌ 19న రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనున్న సంగతి కూడా తెలిసిందే.