నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు..విద్యార్థులకు కీలక సూచనలు..

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు నేటి నుంచి ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి.అగ్రికల్చర్, ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగాల పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లను జూలై 2వ తేదీనే పూర్తి చేశారు..రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 14, 15 తేదీలల్లో జరగాల్సిన అగ్రికల్చర్, మెడిసిన్ లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్షను వాయిదా వేశారు. మళ్లీ వీటిని ఎప్పుడు నిర్వహించనున్నారనే తేదీలను మాత్రం ప్రకటించలేదు.

రేపటి నుంచి ఇంజనీరింగ్ విభాగంలో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్ష జరగనుంది. 18, 19, 20 తేదీల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి 6 గంటల వరకు జరగనుంది. తెలంగాణలో మొత్తం 89, ఏపీలో 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1.72 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని.. ఎంసెట్ కన్వీనర్ ఆచార్య గోవర్థన్ వివరించారు. గతేడాది వీటి కోసం 1.62 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ సంవత్సరం ఆ సంఖ్య పెరిగిందని తెలిపారు. ప్రతి సెషన్‌లో దాదాపు 29 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

ఈ మేరకు కన్వీనర్ కొన్ని సూచనలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాలను హాల్ టికెట్లలో పొందు పరిచామని.. వాటిని జాగ్రత్తగా చూసుకొని.. ఎగ్జామ్ సెంటర్ కు ఒక గంట ముందే చేరుకోవాలన్నారు. ఆలస్యం అయితే సెంటర్లోకి అనుమతి ఉండదని పేర్కొన్నారు. హాల్ టికెట్ పై ఉన్న సూచనలను క్షుణ్ణంగా చదవాలని.. అవన్నీ పాటించాలని వివరించారు. హాల్ టికెట్ తోపాటు.. అప్లికేషన్ ఫామ్, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిని కార్డు తీసుకురావాలని సూచించారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించాలని,మాస్క్, శానిటైజర్ ను వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ పరీక్షలు ఆన్ లైన్ విధానంలో నిర్వహించనున్నట్లు తెలిపారు..ఎంసెట్ లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ర్యాంకులను ఇవ్వనున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news