ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు..దరఖాస్తు ఇలా చేసుకోండి..

-

గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్ అండ్ ఇంజనీర్ లిమిటెడ్ లో ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేశారు.ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా..

పోస్టులు: ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్
మొత్తం ఖాళీలు: 249
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 16-07-2022 మధ్యాహ్నం 2 గంటల నుంచి..
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 05-08-2022 రాత్రి 11.59 నిమిషాల వరకు.
వయస్సు:14 సంవత్సరాలు నుంచి 20 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ట్రేడ్ అప్రెంటిస్ (Ex-ITI) 163 AITT

ట్రేడ్ అప్రెంటిస్ (ఫ్రెషర్) 40 10వ తరగతి లేదా తత్సమానం

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 16 డిగ్రీ (ఇంగ్లీషు/టెక్నాలజీ)
టెక్నీషియన్ అప్రెంటిస్ 30 డిప్లొమా (ఇంగ్లీషు)

ఇంకో నోటిఫికేషన్..

గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్ అండ్ ఇంజనీర్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సూపర్‌వైజర్, ఇంజనీర్ టెక్నీషియన్, డిజైన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు..
వివరాలు..
మొత్తం ఖాళీలు:58

వయస్సు: 28ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది..

పోస్టుల ఖాళీలు: 03 .

అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే.. CA/ CMA (ఇంటర్), గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేట్ డిప్లొమా, PG డిప్లొమా చేసి ఉండాలి. ఇంజిన్ టెక్నీషియన్ (SI గ్రేడ్) పోస్టుల ఖాళీలు 08. ఇంజనీరింగ్ లో సంబంధిత సబ్జెక్ట్ లో డిప్లమా పూర్తి చేసి ఉండాలి. ఈ రెండు పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియమించుకోనున్నారు.
సూపర్ వైజర్ మరియు డిజైన్ అసిస్టెంట్ పోస్టులను తాత్కాళిక ప్రాతిపదికన తీసుకోనున్నారు.
సూపర్ వైజర్ పోస్టుల 30, డిజైన్ అసిస్టెంట్ పోస్టులు 17 ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యూయేషన్ డిప్లమా, పీజీ డిప్లమా చేసిన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు.

నోటిఫికేషన్ పూర్తీ వివరాలను www.grse.in ఈ వెబ్‌సైట్ లో తెలుసుకోగలరు..

Read more RELATED
Recommended to you

Latest news